నటరత్న నందమూరి తారక రామారావు ఈ యుగానికి ఆయన ఒక్కడు మాత్రమే తెలుగులో తిరువలేని రికార్డులు సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రను తిరగ రాశాడు. ఆయనతో నటించిన హీరోయిన్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఎన్టీఆర్ తో నటించాలని అప్పటి హీరోయిన్లు ఎంతో ఆసక్తిగా ఉండేవారు. అంతేకాదు ప్రతి విషయంలోనూ ఎంతో కచ్చితంగా ఉండే ఎన్టీఆర్ తో నటిస్తే వారికి నటన విషయంలో అలాగే క్రమశిక్షణ విషయంలో కొన్ని పద్ధతులు అలవాటు అవుతాయని హీరోయిన్స్ అంతా కూడా ఆ ఛాన్స్ కోసం ఎదురు చూసేవారు.
ఇక మరో అగ్ర నటి జయలలిత విషయంలో కూడా ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది. మీ హీరోయిన్‌గా తమిళ్లో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఎన్టీఆర్ తో నటించే అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఆమె ఉపయోగించుకుని ఎన్టీఆర్ తో జయలలిత కలిసి నటించిన తొలి సినిమా గోపాలుడు భూపాలుడు. ఈ సినిమా తరవాత ఈ జంటకి మంచి పేరు వచ్చింది.
ఇక అలా ఎన్టీఆర్ తో జయలలిత ఎన్నో సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ తో శ్రీకృష్ణసత్య సినిమాలో జయలలిత సత్యభామగా నటించింది ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ నిర్మించడం మరో విశేషం. ఈ ఇద్దరి జీవితంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా ప్రవేశించి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఒక వెలుగు వెలిగారు.
ఎన్టీఆర్ జయలలిత కలిసి దాదాపు 11 సినిమాలుకు పైగా నటించారు. ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఎన్టీఆర్, జయలలిత తల్లి సంధ్యతో కూడా కలిసి నటించారు. జయలలిత తల్లి సంధ్యతో ఎన్టీఆర్ మాయాబజార్, తెనాలి రామకృష్ణ, వంటి పలు సినిమాలలో కలిసి నటించారు. ఇలా ఎన్టీఆర్ ఇద్దరి తల్లి కూతుర్లతో కలిసి నటించిన హీరోగా రేర్ ఫీట్ ని సాధించిన హీరోలలో ఎన్టీఆర్ ప్రధమంగా ఉంటారు.