ఆమె వల్ల పవన్ రాజకీయ జీవితంపై గట్టి దెబ్బ పడేనా..?

మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ రెండవ భార్య హీరోయిన్ రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరూ బద్రి సినిమాలో నటించడం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత జానీ సినిమాని తెరకెక్కించారు.ఈ చిత్ర సమయంలోనే వీరిద్దరూ సహజీవనం చేయడంతో అకిరా నందన్ జన్మించారు. అకిరా నందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన వీరికి ఆధ్యా అనే పాప కూడా జన్మించింది.

Renu Desai : Pawan Kalyan convinced me

అయితే కొన్ని కారణాల చేత మళ్లీ కొద్ది రోజులకే విడిపోవడం జరిగింది.ప్రస్తుతం రేణు దేశాయ్ ఒంటరిగా ఉంటూ తన పిల్లల బాగోగులను మాత్రమే చూసుకుంటోంది. పవన్ కళ్యాణ్ మాత్రం మూడో వివాహాన్ని నటి అన్నా లేజినోవా ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమెతోనే పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నప్పటినుంచి ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.

ఈ మధ్యకాలంలో అకిరా బర్తడే సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ తో గొడవ పడడం జరిగింది. తాజాగా సోషల్ మీడియా ఖాతాలో రేణు దేశా ఒక పోస్ట్ షేర్ చేసి వీడియో కూడా వైరల్ గా మారింది.. జీవితం సంబంధాలు ఇంకా మరెన్నో విషయాల గురించి నేను చాలా గంభీరంగా మాట్లాడుతున్నాను ఒక ఎపిసోడ్లో మీలో చాలామందికి సహాయపడతానని నేను భావిస్తున్నాను కమింగ్ సూన్ అంటూ ఆమె లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఈ వీడియో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెట్టిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం పైన దెబ్బ కొట్టడానికి ఈమె ఇలాంటి వీడియోలు చేస్తోంది. అంటూ పలువురి నటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Share post:

Latest