విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన త‌ప్పే అఖిల్ చేశాడా… ఏజెంట్ ప్లాప్‌కు అదే కార‌ణ‌మా..?

కొందరు యువ హీరోలు అగ్ర దర్శకులను నమ్మి నెలల తరబడి కష్టపడి ఆ దర్శకుడు చెప్పినట్టుగా ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తారు. ఇక తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే బొక్క బోర్లా పడుతున్నారు. తమ చేతిలో పెద్ద దర్శకుడు ఉన్నాడు, భారీ బడ్జెట్ నిర్మాతలు ఉన్నారు ఇక మనం ఆదర్శకుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అనుకుంటున్నారు తప్ప.. ప్రధానంగా ముఖ్యమైన బలమైన కథ ఉందా లేదా అని ఆలోచించడం లేదు.

ఇప్పుడు అదే ఘోర పరాజయాలకు కారణమవుతుంది. గత సంవత్సరం రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్ భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. విడుదలకు ముందు ఈ సినిమా యూనిట్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మరి ప్రధానంగా హీరో విజయ్ దేవరకొండ సినిమా విడుదలయ్యాక థియేటర్లు బద్దలవుతాయి, వసూళ్ల వర్షం కురుస్తుందంటూ సినిమాపై అంచనాలు పెంచేశాడు.

లైగ‌ర్ - ఏజెంట్ డిజాస్ట‌ర్ల వెన‌క ' బావ‌మ‌రిది ' … ఎవ‌రో తెలిస్తే మైండ్ బ్లాకే బ్లాక్‌..! - Telugu Lives

తీరా సినిమా విడుదలయ్యాక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ మూవీలో ఏముందని అంత హడావుడి చేశారంటూ పెదవి విరిచారు. ఇప్పుడు నిన్న విడుదలైన ఏజెంట్ సినిమాను చూస్తే లైగ‌ర్ సినిమా గుర్తుకు వస్తుందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన చెత్త సినిమాలో కిక్ 2, త‌ర్వాత ఏజెంట్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది. ఏజెంట్ సినిమా 2023 బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటోని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏజెంట్ సినిమాలో హడావుడి ఎక్కువ అసలు విషయం తక్కువ అని.. అఖిల్ తన లుక్ ను మార్చుకోవటంలో పెట్టిన శ్రద్ధ ఈ సినిమా కథ విషయంలో పెట్టి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. అఖిల్ తన కెరీర్ పరంగా సరైన అడుగులు వేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని డిజాస్టర్లు తప్పవని చెప్పవచ్చు. ఖరీదైన తప్పులు చేయడం వల్ల అఖిల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ కెరీర్ విషయంలో చేస్తున్న చిన్నచిన్న తప్పులు ఈ యంగ్ హీరో కెరీర్ కు ప్రమాదంగా మారుతున్నాయి.