సమంత గుడి కోసం అభిమాని ఎంత ఖ‌ర్చు పెట్టాడో తెలిస్తే షాకైపోతారు!

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌ టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల‌ భామ స‌మంత‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటి ప్ర‌భావం వృత్తిపై ప‌డ‌కుండా ముందుకు సాగుతోంది. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న స‌మంత‌కు తాజాగా ఓ విరాభిమాని ఏకంగా గుడి క‌ట్టేశాడు.

ఏప్రిల్ 28 సమంత పుట్టినరోజు సందర్బంగా ఈ గుడిని ప్రారంభించాడు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్‌ అనే వ్యక్తికి సమంత అంటే చాలా ఇష్టం. నటిగా కన్న సమంతలో ఉన్న సేవ గుణమే సందీప్ ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంది. ప్రత్యూష ఫౌండేషన్ తరపున సమంత చేస్తున్న సేవలతో ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి.

దీంతో సమంతపై సందీప్‌కు ఎంతో అభిమానం పెరిగింది. ఆ అభిమానంతోనే స‌మంత‌కు గుడి క‌ట్టేశాడు. అది కూడా ఎక్కడో కాదు తన ఇంట్లోనే. శుక్రవారం సమంత పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా ఆ గుడిని ప్రారంభించాడు. ఇక ఈ గుడి కోసం సందీప్ ఎంత ఖ‌ర్చు పెట్టాడో తెలిస్తే షాకైపోతారు. దాదాపుగా ఐదు నుండి ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేసి మ‌రీ స‌మంత‌కు సందీప్ గుడి క‌ట్టించాడ‌ట‌.

Share post:

Latest