విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్‌తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్యడానికి చాలా కష్టాలు అనుభవించాడు.
కెరీర్ మొదట్లో తొలివలపు అట్టర్ ప్లాఫ్ కావడంతో గోపిచంద్ నిరాశకు గురయ్యాడు. మళ్లీ తర్వాత ఎలాగో తానేంటో ప్రూవ్ చేసుకోవాలని విలన్ పాత్రలు వేశాడు. ఈ క్రమంలో తేజ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమాలో విలన్ గా నటించాడు. అందులో గోపీచంద్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలోనూ, మహేష్ బాబు నిజం సినిమాలోని విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు.
తర్వాత హీరోగా యజ్ఞం సినిమాలో హీరోగా చేసి సూపర్ హిట్ కొట్టాడు. అప్పటినుంచి గోపీచంద్ వెనుతిరిగి చూసుకోలేదు. రణం- లక్ష్యం- లౌక్యం అంటూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ హిట్ కొట్టి స్టార్ హీరోగా తన కంటు ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ కు జంటగా డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుంది.
సమ్మర్ కానుకగా మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా విడుదల తేది దగ్గర పడతందో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూ లో, ప్రమోషన్ లో పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ తన పిల్లల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తాను హీరో అయినా.. తన పిల్లలు అందరూ లాగే బస్సులో స్కూల్ కి వెళ్తారు వాళ్లకి ప్రత్యేక కార్ ఇచ్చి అసలు పంపించానని చెప్పాడు.
ఎందుకంటే వారికి కూడా కష్టం విలువ, డబ్బు విలువ తెలియాలి.. అంతేకాకుండా డబ్బు ఉంది కదా అని ఎలాపడితే అలా ఖర్చు పెట్టకుండా వారి అవసరాలకు ఇస్తూ పొదుపుగా వాడుకోవటం నేర్పుతాను. ఈ విధంగా చేస్తేనే డబ్బు విలువ, అలాగే ఎలా సంపాదించాలో వాళ్లకు కూడా తెలుస్తుందంటూ గోపీచంద్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.