ఎన్టీఆర్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్‌ను ఎందుకు న‌మ్మాడు.. అస‌లేం జ‌రిగింది…?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ హీరోగానే కాకుండా కమర్షియల్ యాడ్స్ తో కూడా ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఇప్పటివరకు నటించిన కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువ శాతం స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేసాడు అంటూ ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది.

త్రివిక్రమ్ తో పనిచేయడం అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమనే టాక్ కూడా ఉంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత వీర రాఘవ సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మళ్ళీ వీరి కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ గతంలో ఓ ప్రకటన కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అక్కడితో ఆగిపోయింది.

Jr NTR and Trivikram Srinivas to team up once again? | Telugu Movie News -  Times of India

ప్రస్తుతం ఎన్టీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ కంపెనీ యొక్క కమర్షియల్‌ వీడియోను రూపొందించే పనిలో త్రివిక్రమ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ తో సినిమా మిస్ అయినా కూడా ఒక కమర్షియల్‌ యాడ్ తో ఎన్టీఆర్‌ రాబోతున్నాడు. కమర్షియల్‌ యాడ్‌ విషయంలో త్రివిక్రమ్ పై ఎన్టీఆర్‌ కు ఎక్కువ నమ్మకం ఉంది. అందుకే ఆయన దర్శకత్వంలో మాత్రమే నటించేందుకు ఆసక్తిని కనబర్చుతూ ఉంటాడు.

Share post:

Latest