” ఆదిపురుష్ ” నుంచి మెస్మరైజింగ్ అప్డేట్… కృతిస‌న‌న్ రోల్‌పై బ్లాస్టింగ్ పోస్ట‌ర్..!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ తాజా సినిమాలలో ఒకటైన ఆదిపురుష్ పై ఇప్పుడు మరింత ఆసక్తి ఏర్పడుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం భారతీయ సినిమా దగ్గర భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మరి ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

Adipurush: ఎట్టకేలకు ఆదిపురుష్ నుండి అప్డేట్ వచ్చేసింది.. శ్రీరామనవమి గిఫ్ట్ అదిరింది! - 10TV Telugu

అలా రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అలాగే, ప్రభాస్ రామ్ అవతారం గెటప్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా నుంచి సీతమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. సీత గా నటిస్తున్న కృతి సనన్ పై ఓ బ్యూటిఫుల్ వీడియో అప్డేట్ అయితే వదిలారు. రామాయణంలో కీలక ఘట్టమైన రావణ చెర లో ఉన్న సీతగా కృతిని చూపించడం అలాగే ప్రభాస్ పై కూడా చిన్న పోస్టర్‌ను కూడా చూపించారు.

బాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో దూసుకెళ్తున్న కృతి సనన్ సీత పాత్రలో ఒదిగిపోయినట్టు ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధమవుతుంది.కృతి సనన్ కి ఆదిపురుష్ మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.పైగా ఈ మోషన్ పోస్టర్ వీడియోలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత మాయ చేసింది అని చెప్పొచ్చు. డెఫినెట్ గా మ్యూజికల్ పరంగా కూడా ఈ సినిమా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది అనిపిస్తుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Share post:

Latest