పోకిరి @17 ఏళ్ళు.. సృష్టించిన రికార్డులు ఇవే..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహేష్ బాబు కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలలో ఒక్కడు తర్వాత పోకిరి సినిమాకి అంతటి పేరు ఉందని చెప్పవచ్చు.. పోకిరి సినిమాకు ముందు మహేష్ బాబు స్టార్ హీరోనే కానీ మహేష్ బాబు మార్కెటింగ్ మాత్రం రెట్టింపు చేసింది పోకిరి సినిమానే అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.


ఎలాంటి హైట్ లేకుండా విడుదలైన ఈ సినిమా పెను సంచనాలను సృష్టించింది అప్పటికి 299 కేంద్రాలలో 50 రోజులు , 200 కేంద్రాలలో 100 రోజులు,63 కేంద్రాలలో 175 రోజులు ఒక థియేటర్లో 1000 రోజులు ఆడి పలు రకాల రికార్డులను సైతం సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది.

1). నైజాం-12.3 కోట్ల రూపాయలు
2). సి డెడ్-5.26 కోట్ల రూపాయలు
3). ఉత్తరాంధ్ర-3.8 కోట్ల రూపాయలు
4). ఈస్ట్ -2.26 కోట్ల రూపాయలు
5). వెస్ట్-2.18 కోట్ల రూపాయలు
6). గుంటూరు-3.21 కోట్ల రూపాయలు
7). కృష్ణ-2.84 కోట్ల రూపాయలు
8). నెల్లూరు-1.26 కోట్ల రూపాయలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.32.12 కోట్ల రూపాయలను రాబట్టింది.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ.40.4 కోట్ల రూపాయలను రాబట్టినట్లు తెలుస్తోంది.

పోకిరి చిత్రం కేవలం 15 కోట్ల రూపాయల థియేటర్లు బిజినెస్ జరగకుండా ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా రూ.40.4 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా కొన్ని బైయర్లకు 25 కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని చేకూర్చింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడమే కాకుండా మహేష్ బాబు రేంజ్ ను కెరియర్ కు ఒక మైలురాయిగా నిలిచింది.