`ఎన్టీఆర్ 30`లో తార‌క్ డ‌బుల్ ధ‌మాకా.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్‌ టైటిల్ తో ఇటీవల ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువ‌సుధ ఆర్ట్స్‌ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంద‌ని.. న‌రరూప రాక్షసులతో ఎన్టీఆర్ పోరాటం చేయ‌బోతున్నాడ‌ని ఇప్ప‌టికే కొర‌టాల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే తాజాగా ఏం సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

అదేంటంటే.. ఇందులో తార‌క్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. ఆయ‌న‌ రెండు విభిన్నమైన పాత్రలో అల‌రించ‌బోతున్నాడ‌ట‌. అంటే డ‌బుల్ ధ‌మాకా అన్న మాట‌. తార‌క్ డబుల్ యాక్షన్ ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజ‌మైతే థియేట‌ర్స్ లో ఫ్యాన్స్ కి పూన‌కాలే అని అంటున్నారు.