షారుక్ ఖాన్ సినిమాలో బికినీ ధరించిన నయనతార.. కారణమిదే..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాపై ఉత్కంఠ నెలకొంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ఈ చిత్రంపై అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నిరీక్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన పఠాన్ సినిమా షారుక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో షారుక్ తర్వాతి సినిమా అయిన జవాన్‌పై భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమాలో షారుక్ సరసన హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ ఇద్దరూ తొలిసారి జోడీ కట్టారు. ఈ సినిమాలో నయనతార బికినీ ధరించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో 13 ఏళ్లుగా స్విమ్ సూట్ లేదా బికినీ ధరించని నయనతారా తాజాగా తన కట్టుబాటును షారుక్ సినిమా కోసం పక్కన పెట్టినట్లు సినీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. దీనిలో వాస్తవమెంతో తెలుసుకుందాం.

తమిళ సినిమా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార తన బాలీవుడ్ అరంగేట్రం, షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం జవాన్‌లో బికినీ ధరించిందని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. దీనికి ఎటువంటి బేస్ లేదు. షారుక్-దీపిక పదుకొణె నటించిన పఠాన్ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. పఠాన్ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొణె స్విమ్ సూట్ ధరించింది. బికినీలో ఆమె అందచందాలను ఆరబోసింది. దీనిపై విమర్శలొచ్చినా, సినిమా ప్రచారానికి ఇది బాగా ఉపయోగపడింది. దీనినే షారుక్ తర్వాత సినిమాలోనూ కొనసాగిస్తారని కొందరు ఊహాగానాలు పుట్టించారు. దీంతో నయనతార ఈ సినిమాలో బికినీ ధరించినట్లు చిలువలు పలువలుగా ప్రచారం మొదలు పెట్టేశారు. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ఏమీ చెప్పకపోయినా కొందరు సొంతంగా ఊహించి ఇలా చేశారు. గతంలో అజిత్ హీరోగా వచ్చిన భిల్లా సినిమాలో తొలిసారి నయనతార ఇలా బికినీలో కనిపించింది. ఆ తర్వాత మరే సినిమాలోనూ గ్లామర్ షో చేయలేదు.