`సీతా రామం` తర్వాత అందుకే 6 నెల‌లు ఖాళీగా ఉన్నా.. ఓపెన్ అయిన‌ మృణాల్‌!

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి,ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన మృణాల్‌.. గత ఏడాది `సీతా రామం` సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ను అందుకుని ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది.

అయితే సీతా రామం విడుదల తర్వాత దాదాపు ఆరు నెలలు మృణాల్‌ ఖాళీగా ఉంది. ఆరు నెలల్లో ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆమె సైన్ చేయలేదు. ఫైనల్ గా న్యాచురల్ స్టార్ నాని 30వ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ప‌డిన త‌ర్వాత కూడా ఆరు నెలలు ఖాళీగా ఉండడానికి కారణం ఏంటి అనే విషయంపై తాజాగా మృణాల్ ఓపెన్ అయింది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. “సీత రామంలో నటించడం ఒక గొప్ప అనుభూతి. ఈ సినిమా తర్వాత నేను పెద్ద దర్శక నిర్మాతను కలిసి వారితో వర్క్ చేయాలని ఉందని అడిగినప్పుడు `మీకోసం మంచి పాత్రలు సిద్ధం చేస్తాం. సీతారామంలో పాత్ర కంటే గొప్పగా ఉండేలా రాయాలంటే కొంచెం సమయం పడుతుంది` అని చెప్పేవారు. అందుకే నాకు ఆ సినిమా తర్వాత మరొక ప్రాజెక్ట్ కు సైన్ చేయడానికి దాదాపు 6 నెలలు పట్టింది` అని పేర్కొంది. ఇక నాని 30 గురించి మాట్లాడుతూ.. తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్ ను ఎప్పుడూ చదవలేదని కొనియాడింది.