ఒక సినిమా పూర్తి కావాలంటే డైరెక్టర్‌కి ఆ సినిమాలో నటించే ఆర్టిస్టులకు మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా డైరెక్టర్‌కి, హీరోకి మధ్య మంచి బాండింగ్ ఉంటే సినిమాలో ఎలాంటి లోటు పాట్లు ఉండవు. అయితే కొంతమంది స్టార్ హీరోలతో సినిమా తీసే విషయంలో చాలా ఆందోళన చెందుతుంటారు. సినిమాలో డైరెక్టర్ అనుకున్న సీన్ సరిగ్గా రాకపోయినా కూడా హీరోని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నిరాశ పడుతుంటారు. ఇలాంటి ఘటన ఇటీవలే ఒక కొత్త డైరెక్టర్‌కి, స్టార్ హీరోకి మధ్య జరిగింది.
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన సినిమా ‘దసరా ‘. ఈ సినిమాలో నేచరల్ స్టార్ నాని హీరోగా నటించగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దసరా సినిమా షూటింగ్ సమయంలో నాని ఎంతగానో కోపరేట్ చేసారని శ్రీకాంత్ పలు సందర్భలో చెప్పారు. కానీ ఒక విషయంలో మాత్రం నానిపై అతనికి బాగా కోపం వచ్చిందట. ప్రస్తుతం శ్రీకాంత్ ఒదెలా, నానిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దసరా సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత నాని ఫస్ట్ పార్ట్ చూశారట. సెకండ్ పార్ట్ ని సంగీత దర్శకుడు సంతోష్ నాయర్ తో కలిసి చూస్తానని శ్రీకాంత్ తో చెప్పారట నాని. కానీ నాని సెకండ్ పార్ట్ లో స్టార్టింగ్ నుంచి చూడకుండా మధ్యలో నుంచి చూశారట. అయితే నాని సెకండ్ పార్ట్ స్టార్టింగ్ నుంచి చూసి ఎమోషనల్ అయ్యి, తన దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని పంచుకుంటారని శ్రీకాంత్ ఎక్స్‌పెక్ట్ చేసారట. కానీ నాని నుంచి ఎటువంటి స్పందన లేదని శ్రీకాంత్ చాలా బాధపడ్డారట. ఈ విషయాన్ని శ్రీకాంత్ ఒక మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.