రూ. 100 కోట్లా..? మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరి టూ మచ్ చేస్తున్నాడే..?

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ వాళ్ళల్లో కొంతమందే సక్సెస్ అయ్యారు . అలాంటి వారిలో ఒకరే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ . పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు . ఆ తర్వాత తనదైన స్టైల్ సినిమా చూస్తూ ఇట్లు ఫ్లాప్ లు అని తేడా లేకుండా మెగా హీరో ట్యాగ్ ని వాడుకుంటూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెగా హీరోగా రాజ్యం ఏలేస్తున్నాడు. ఆయన తాజాగా చేస్తున్న సినిమా “విరూపాక్ష “.

విలేజ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఇది అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది . ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ వహించాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో సస్పెన్స్ గా కొనసాగిన ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

కాగా ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది హిట్ మూవీగా నిలుస్తుంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే వంద కోట్ల క్లబ్ లోకి చేరాలని తహతలాడుతున్నారు సాయి ధరమ్ తేజ్ అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఆయన తమ్ముడు వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు . ఉప్పెన సినిమాతో వైష్ణవ తేజ్ 100 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక అన్నగా ఉండి ఇప్పటికీ 100 కోట్ల క్లబ్ లోకి చేరకపోతే అది పరువు తక్కువగా అవుతుందని .. ఈ సినిమాలో కష్టపడి నటించాడట సాయిధరమ్ తేజ్ . కేవలం సాయి ధరమ్ తేజ నే కాదు . ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న కుర్ర హీరోలు అందరూ సినిమాలు 100 కోట్ల క్రాస్ అయ్యే విధంగా టీం ని సెట్ చేసుకుంటున్నారు . రీసెంట్గా టైర్ 2 హీరో కింద వచ్చే నాని .. దసరా సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఫాన్స్ మాత్రం సాయిధరమ్ తేజ్ టూ ఎక్స్పెక్టే చేస్తున్నాడు అంటున్నారు .ఈ సినిమాలో 100 కోట్ల క్లబ్ లోకి వచ్చే అంత సీన్ ఉందా..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!