నయనతారకి అంత టెక్కా… తెలుగులో ఇక నటించదా?

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. తెలుగులో అరాకొరా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తమిళంలో మాత్రం తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా తెలుగులో చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆమె దగ్గరకి ఓ తెలుగు కమర్షియల్ సినిమా కోసం నిర్మాతలు సంప్రదిస్తే తెలుగు సినిమాలకి ఆమె నో చెప్పిందట. ఒక సీనియర్ స్టార్ హీరోకి జోడిగా నయనతారను ఎంపిక చేసేందుకు ప్రయత్నించిన దర్శక నిర్మాతలకు ఈ క్రమంలో చుక్కెదురైందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

తనకు తెలుగులో నటించేందుకు ఆసక్తిగా లేదంటూ తన మేనేజర్ ద్వారా సమాచారం అందించి, షాక్ ఇచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ నిర్మాతల మండలి ఆమెపైన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తమిళంలో ఆమెకి సాగిపోతుండబట్టే ఇలా ఓవర్ చేస్తుందని, అక్కడ అవకాశాలు కరువైతే ఇక్కడికే రావాలి కదా… అప్పుడు చూసుకుందాం అని నిర్మాతలు మిన్నకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే నయనతార 40 ఏళ్లకి దగ్గరలో పడింది. అయినా అవకాశాలకు కొదువేం లేదు. పైగా నయన్ హిందీలో జవాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి తన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తే హిందీలో కూడా వరుసగా సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం లేకపోలేదు.

ఎంత లేడీ సూపర్ స్టార్ అయినప్పటికీ అంతటెక్కు అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. నయనతార అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తే బాగుంటుంది కానీ ఎంపిక చేసుకొని ఫలానా భాషలోనే సినిమా చేస్తాను అంటే ఎంత వరకు సమంజసం అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలుగులో కూడా ఆమెకు ఫాలోయింగ్ వున్న నేపథ్యంలో చాలా మంది ఆమె సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఇలా ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.