ఓ వైపు సమంత తో.. మరో వైపు రష్మిక తో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. అస్సలు ఎవరు ఈ దేవ్ మోహన్..?

దేవ్ మోహన్.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు . అదే సమంత హీరోయిన్గా నటిస్తున్న శాకుంతలం సినిమాలో దుశ్యంతుడి పాత్రలో కనిపించబోతున్న నటుడు అని చెప్తే మాత్రం అందరి మైండ్ లోకి ఓ విజువలైజేషన్ మెరుస్తుంది . హా..శకుంతలం సినిమాలో చాలా పద్ధతిగా నటించిన ఈ హీరో తెలుగులో ఎలాగైనా మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి తహతహలాడుతున్నారు . అంతేనా రీసెంట్గా రష్మిక మందన సైన్ చేసిన రెయిన్ బో సినిమాలోను హీరోగా నటిస్తున్నాడు.

ఈ క్రమంలోని ఇద్దరు పాన్ ఇండియా బ్యూటీస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలల్లో హీరో గా నటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే అసలు ఎవరు ఈ దేవమోహన్..? ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు ..? ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న ఈ హీరోకి ఇంతకూ ముందు తెలుగులో అవకాశాలు ఎందుకు రావడం రాలేదు..? అని ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోనే దేవ్ మోహన్ గురించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి .

1992లో దేవ్ మోహన్ కేరళ రాష్ట్రంలోని లో జన్మించాడు . మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈయన బెంగళూరులో కొన్నాళ్లపాటు జాబ్ చేశాడు. అయితే చాలామంది లా ఇతనికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సినిమా చేస్తూ కొత్త వారి కోసం వెతుకుతూ ఉంటే.. అలా స్నేహితుడు సలహా మీద ఈ రంగంలోకి వచ్చాడట. ఆ తర్వాత ఈ రంగాని విడిచిపెట్టలేకపోయాడు . ప్రజెంట్ మలయాళం లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా దేవమోహన్ కొనసాగుతున్నాడు . శాకుంతలం -రెయిన్ బో సినిమా హిట్ అయితే మాత్రం తెలుగులో కూడా స్టార్ హీరోగా మారిపోతాడు అంటున్నారు జనాలు..!!