బిగ్ బ్రేకింగ్: షూటింగ్ లో స్టార్ హీరో కి ప్రమాదం..హాస్పిటల్ లో అడ్మిట్..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న సంజయ్ దత్ ఓ మూవీ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారా..? అంటే అవునని అంటుంది బాలీవుడ్ మీడియా వర్గాలు . అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్..ధృవ సర్జ హీరోగాతెరకెక్కుతున్న కేడి చిత్రంలో విలన్ రోల్ లో నటిస్తున్నారు .

 

ఈ క్రమంలోనే భారీ యాక్షన్స్ సీన్స్ నటిస్తున్న క్రమంలో భారీ పేలుడు కీ ప్లాన్ చేశారు . ఈ పేలుడు కారణంగా సంజయ్ దత్ చేతులు – ముఖం -భుజం బాగా కాలిపోయినట్లు తెలుస్తుంది. బాగా గాయాలైనట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పొరపాటున ఇలాంటి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది చిత్ర బృందం అన్ని భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదం ఎలా జరిగింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది ..?

అయితే స్పాట్ లోని యాక్షన్ తీసుకున్న చిత్ర బృందం హుటాహుటిన సంజయ్ దత్ ని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది . ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు . అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వైద్యులు వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. దీంతో ప్రెసెంట్ సంజయ్ దత్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . కాగా కేజిఎఫ్ 2 లో ఆయన ప్రధాన విలన్ రోల్ చేసే అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే.