వావ్: కని విని ఎరుగని ఛాన్స్..జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మెగా డైరెక్టర్ బాబీ..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు . యం డైరెక్టర్లు ఉన్నారు. రీసెంట్గా ఇండస్ట్రీలో కి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన డబ్ల్యూ డైరెక్టర్లు ఉన్నారు . కానీ వాళ్ళందరిలోకి చాలా ప్రత్యేకం డైరెక్టర్ బాబీ. చాలా సైలెంట్ గా చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉండే ఈ డైరెక్టర్.. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమాను తెరకెక్కించాడు.

ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. చిరంజీవి అభిమానులకు పూనకాల తెప్పించేసింది . ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే .. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది అంటే ఈ సినిమా మెగా అభిమానులకు ఎలా నచ్చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు . కాగా హీరో స్టైల్ ని బట్టి జనాల నాడిని తెలుసుకొని మూవీలు తెరకెక్కించడంలో బాబీకి పెట్టింది పేరు.

ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య తర్వాత బాబి ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అయింది . ఈ క్రమంలోని అలాంటి వాళ్లకు అదిరిపోయే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాబి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ తో ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . తన కెరీయర్ లోనే కని విని ఎరుగని ఆఫర్లు అందుకున్నాట్లు బాబీ తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోనే ఈ న్యూస్ కోలీవుడ్లో టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం డైరెక్టర్ బాబీ జాక్ పాట్ ఆఫర్ కొట్టాడని చెప్పాలి . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?