నమ్మించి నిండా ముంచేసిన నాని.. కక్కలేక మింగలేని పొజీషన్ లో మృణాల్..ఏమైందంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన రీసెంట్గా నటించిన దసరా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో నాని పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . అంతేకాదు ఈ సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిన నాని తర్వాత సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా స్టెప్ తీసుకుంటున్నాడు అంటూ తెలుస్తుంది .

నాని తన తర్వాతి సినిమాని దర్శకుడు శార్యూన్ తో కలిసి తీయబోతున్నాడు. ఈ క్రమంలోని ఈ సినిమాల్లో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఫిక్స్ చేసాడు. ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . కాగా నాని 30 సినిమాలో అవకాసం రావడం పట్ల మృణాల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది . అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్నో భారీ ఆఫర్స్ కూడా వదులుకుంది అన్న టాక్ అప్పట్లో వైరల్ గా మారింది .

అయితే సడన్గా ఈ సినిమాలో స్టార్ డాటర్ శృతిహాసన్ ని కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. అంతేకాదు షూటింగ్స్ సెట్స్ లో కూడా పాల్గొనేసింది శృతిహాసన్ . ఈ క్రమంలోని సినిమాలో తాను ఒక్కటే హీరోయిన్ అనుకున్నా మృణాల్ కు బిగ్ షాక్ తగిలినట్టు అయింది . అంతేకాదు నాని ని నమ్మినందుకు భారీ దెబ్బ తగిలినట్టు అయింది . కచ్చితంగా మృణాల్ శృతిహాసన్ తో కంపేర్ చేస్తే శృతిహాసన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు జనాలు.. మేకర్స్ . ఈ క్రమంలోనే మళ్లీ ఈ సినిమాలో మృణాల్ బిస్కెట్ క్యారెక్టర్ అవ్వబోతుంది అంటు జనాలు ట్రోల్ చేస్తున్నారు . ఈ పరిస్థితుల్లోనే సినిమాలో ఉండలేక సినిమా నుంచి బయటకు రాలేక మృణాల్ అల్లాడిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . చూడాలి మరి దీనిపై మృణాల్ ఎలాంటి బోల్డ్ స్టెప్ తీసుకుంటుందో..?

Share post:

Latest