Big boss -7: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ యాంకర్..?

స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ఈ గేమ్ షో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే..ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ వన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించారు.. ఆ తర్వాత సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. వీరిద్దరూ హోస్ట్ గా వ్యవహరించిన మంచి రేటింగ్ రావడం జరిగింది.. ఆ తరువాత మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ సీజన్ 6 వరకు కొనసాగించాడు. ఇప్పుడు సీజన్ 7 ప్రారంభం అవుతోంది.

అయితే ఈ సీజన్కు చాలామంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్టార్ యాంకర్ ఉదయభాను ఈమె యాంకర్ గా ఒకప్పుడు ఎన్నో షోలలో హోస్ట్ గా వ్యవహరించింది..అయితే ఇప్పుడు ఉదయభాను అడపాదడపా చానల్స్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే .. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 7 కి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

ఒకప్పుడు యాంకర్లలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాంకర్ ఉదయభాను అంతటి ఇమేజ్ను సంపాదించుకుంది. కొన్ని సినిమాల్లో కూడా కనిపించి మెప్పించింది. ఉదయభానును ఒకప్పుడు జూనియర్ శ్రీదేవి అని పిలిచేవారు.. అంతటి అందం, అనుకువ కలిగివున్న ఉదయభాను బిగ్ బాస్ సీజన్ -7 లోకి ఎంట్రీ ఇస్తున్నారు అన్న వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనే విషయం తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షో కి మొట్టమొదటి లేడీ యాంకర్ రావటం ప్రత్యేకంగా అనిపిస్తోంది .ఇంతవరకు అగ్ర హీరోలు ఈ షోను రాణించారు. ఉదయభాను కెరియర్ కు ఈ షో ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.