పొన్నియన్ సెల్వన్ 2 : ఈ అమ్మాయి విక్రమ్ లైఫ్ లో అంత స్పెషలా..? జన్మలో మర్చిపోలేడా..?

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా పోనియన్ సెల్వన్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . గత ఏడాది పోనియన్ సెల్వన్ రిలీజ్ అయి ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్ సంపాదించి లాభాలు అందుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ కూడా అదే కేటగిరీలోకి జాయిన్ అయిపోయింది . రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే సినిమాలో నటించిన నటినటులు కు సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్లు వైరల్ అవుతున్నాయి .

ఈ క్రమంలోనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన విక్రమ్ – ఐశ్వర్యరాయ్ పాత్రలకు సంబంధించి ఒక న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో నందిని పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాలో కర్త – కర్మ – క్రియ అంతా నందిని చుట్టే తిరుగుతూ ఉంటుంది . ఈ క్రమంలోనే చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ పాత్రలో నటించిన అమ్మడు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. చిన్నప్పటి ఐశ్వర్యారాయ్ పాత్రలో నటించిన అమ్మాయి పేరు సారా అర్జున్ ..

ఈ పేరు చెప్పగానే అందరికీ టక్కున రూపం గుర్తొచ్చింటుంది . ఎస్ మీరు అనుకున్నదే నిజం. విక్రమ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన నాన్న సినిమాలో నటించిన ఆ చిన్న పాపే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన పెద్ద పాప. ఎస్ ఆ సినిమాలో చాలా క్యూట్ క్యూట్ గా నటించినా సారా అర్జున్ .. ఈ సినిమాలో తనదైన స్టైల్ లో అందంతో ఆకట్టుకుంది. నాన్న సినిమా వచ్చి దాదాపు 12 ఏళ్లు దాటిపోయింది . ఈ క్రమంలోనే బయట ఎక్కడ పెద్దగా కనిపించని సారా అర్జున్..విక్రమ్ సలహాతోనే ఈ సినిమాలో నటించింది అంటూ తెలుస్తుంది .

అంతేకాదు ఈ పాత్ర కోసం సారా అర్జునుని సెలెక్ట్ చేసింది విక్రమ్ అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది . నాన్న సినిమాలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సారా అర్జున్ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించి విక్రమ్ లైఫ్ లో మర్చిపోలేని హిట్ అందజేసింది . ఈ క్రమంలోనే సారా అర్జున్ విక్రమ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!