ఢీ షో డాన్స్ కొరియోగ్రాఫర్ మృతికి కారణాలు ఇవేనా..?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలాలు డి షో కూడా ఒకటి.. ఈ షో వల్ల ఎంతోమంది కొరియోగ్రాఫర్లుగా మారి పలు సినిమాలకు కొరియోగ్రాఫర్లుగా పని చేస్తున్నారు. అయితే ఇందులో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న డాన్స్ మాస్టర్ చైతన్య నిన్నటి రోజున మరణించినట్లుగా తెలుస్తోంది .నెల్లూరు క్లబ్ హోటల్లో అతను సూసైడ్ చేసుకున్నట్లుగా సమాచారం. అయితే తను సూసైడ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఆర్థిక ఇబ్బందులే అన్నట్లుగా ఒక వీడియోలో తెలియజేస్తూ మరణించారు.

Chaitanya master & Ranjith Performance Promo - Dhee 15 Championship Battle  Promo - 26th April 2023 - YouTube
ఈ సెల్ఫీ వీడియోలో చైతన్య మాట్లాడుతూ ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు తన తోటి డ్యాన్స్ మాస్టర్కు, డాన్సర్లకు స్వారీ కూడా తెలియజేశారు చైతన్య.. అప్పులు ఇచ్చిన వారీ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నానని చాలా ట్రై చేసిన కూడా అవ్వడం లేదని కూడా తెలిపారు చైతన్య.. ఒక అప్పును పూడ్చేందుకు మరొక తప్పు అలా అప్పులు పెరిగిపోయాయి అంటూ కూడా తెలిపారు.. ఢీ షో వల్ల నేమ్ ప్రేమ్ వచ్చింది ఈ షోకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు..

కానీ డి ప్రోగ్రాం వల్ల పేరు మాత్రమే వచ్చింది.. సంపాదన చాలా తక్కువగా ఇస్తున్నారని ఈ సెల్ఫీ వీడియోలో తెలిపారు. కానీ జబర్దస్త్ ప్రోగ్రాం లో ఎక్కువ మనీ ఇస్తున్నారని కూడా తెలిపారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమాచారం ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. శనివారం రోజున నెల్లూరులోని కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో చైతన్యకు సన్మానం జరిగింది. అయితే శనివారం రోజున అంత యాక్టివ్ గా కనిపించిన చైతన్య ఒక్కరోజు గొడవకు ముందు ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్కు గురవుతున్నారు.

Share post:

Latest