ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న కొడాలి నాని..!!

తాజాగా టిడిపి నేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన బూతుల వర్షం కురిపించడంతో నాని తీవ్రస్థాయిలో చంద్రబాబు పైన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది.. చంద్రబాబు.. సిగ్గులేని మరియు క్యారెక్టర్ లెస్ వ్యక్తి అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. చంద్రబాబు ఎప్పుడు ప్రచారం చేసిన గుడివాడలో ఎన్ని ఎన్నికలలో ఓడిపోయారు.. అది ఒక సెంటిమెంట్ అంటూ తెలియజేశారు గుడివాడ నాని ..నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదు సామాన్యుల కోసం తాను ఏమైనా చేశానని నిరూపించాలని చంద్రబాబుకు బహిరంగంగా సవాలు విసిరారు కొడాలి నాని.

పేదల బాగోగు కోసం చంద్రబాబు నాయుడు ఒక ఎకరా కూడా కొనలేదని నిమ్మకూరులో పేదలకు ప్రజలకు తాను ఏదైనా చేశానని చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు నాని.. తాను రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధులనుంచి రూ .14 కోట్లు విరాళంగా ఇచ్చి నిమ్మకూరుకు విరాళామందించిన ఘనత నందమూరి హరికృష్ణ అదే అంటూ తెలిపారు నాని.. నిమ్మకూరుకు ఎన్టీఆర్, హరికృష్ణ సహకరించారని తెలిపారు. అందుకోసం భారీ విరాళం ఇచ్చారని కూడా తెలిపారు. అందుకే నిమ్మకూరు ప్రజలు హరికృష్ణ ను ఎన్టీఆర్ ను దేవుడుగా భావిస్తారని తెలిపారు.

Worldwide NFans Club » NTR Jr. visits Nimmakuru

జూనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టారని గ్రామంలో 25 ఎకరాల భూమిని ఎన్టీఆర్ కొనుగోలు చేశారని ఎనిమిదేళ్లుగా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా చంద్రబాబు ఎందుకు ఏర్పాటు చేయలేదని నాని తెలియజేశారు. నిమ్మకూరు పై కేవలం ఎన్టీఆర్కు మాత్రమే నిజమైన ప్రేమ ఉందని కొడాలి నాని తెలియజేశారు హరికృష్ణ ప్రతి పది రోజులకు ఒకసారి అయినా సరే గ్రామానికి వచ్చే వారిని తెలిపారు ఎన్టీఆర్ వారసత్వం అని చెప్పుకునే హక్కు మాత్రం చంద్రబాబుకు లేదని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు.