10 నెలల బిడ్డతో తల్లి ఒంట‌రి ప్రయాణం.. హీరో అజిత్ చేసిన ప‌నికి అంతా షాక్‌!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయ‌న సొంతం. సామాన్య వ్యక్తిగా ప్రజల్లో కలసిపోవ‌డం ఆయ‌న నైజాం. న‌టుడిగానే కాదు త‌న సిప్లిసిటీతో అజిత్ ఎక్కువ మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు.

అలాగే అజిత్ గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. తాజాగా ఈ విష‌యం మ‌రోసారి రుజువు అయింది. స్టార్ హీరో హోదాలో ఉన్న అజిత్ ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు. 10 నెలల బిడ్డతో ఓ త‌ల్లి గ్లాస్గో నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తోంది. లండన్ విమానాశ్రయంలో అజిత్ కనిపించారు. దాంతో స‌ద‌రు త‌ల్లి `సార్.. సెల్ఫీ ప్లీజ్‌` అంటూ అజిత్ ను అడ‌గ‌గా.. వెంట‌నే ఆమె సెల్ఫీ ఇచ్చారు. అంతేకాదు, నెలల బిడ్డతో బ్యాగు మోయలేక ఇ‍బ్బందిపడుతున్న ఆమెకు సహాయం అందించారు. సదరు లేడీ ఫ్యాన్ లగేజ్ ని మోశారు.

స‌ద‌రు లేడీ అభిమాని వ‌ద్ద‌ని చెప్పినా స‌రే `నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇబ్బంది ఏంటో నాకు తెలుసు` అని చెప్పి అజిత్ స్వయంగా విమానం వరకు ఆమె లగేజ్ మోశారు. షటిల్ బస్సులో కూడా ఆమె లగేజ్ తో ఇబ్బంది పడుతుంటే అజిత్ సాయం చేశారు. ఈ విష‌యాన్ని స‌ద‌రు లేడీ అభిమాని యొక్క భ‌ర్త కార్తిక్‌ సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ అజిత్ వ్య‌క్తిత‌త్వంపై ప్ర‌శంస‌లు కురిపించారు. దీంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అజిత్ గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. దటీజ్ అజిత్ అంటూ కొన‌యాడుతున్నారు.