మెహందీ చేతులు చూపిస్తూ ఆ విష‌యం చెప్పేసిన అంజలి.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

రాజోలు బ్యూటీ అంజ‌లి ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌`తో స‌హా ప‌లు ప్రాజెక్ట్ ల‌తో అంజ‌లి భాగం అయింది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తోంది.

ఇక‌పోతే అంజ‌లి పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మెహందీ చేతులు చూపిస్తూ విష‌యం చెప్పేసింది. కానీ, పెళ్లి సంగ‌తి కాదండోయ్‌.. ఈరోజు తమిళ కొత్త సంవత్సరం కావడంతో అంజలి నెట్టింట అందంగా ద‌ర్శ‌న‌మిచ్చింది.

 

తమిళ ప్రేక్షకులకు మ‌రియు తన అభిమానులకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో త‌మిళ ఫ్యాన్స్ తిరిగి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, తాజా పిక్స్ లో వైట్ టాప్, రెడ్ డిజైన్ లెహంగా ధరించి బ్యూటిఫుల్ లుక్ లో ఆక‌ట్టుకుంది. మెహందీ చేతుల‌ను చూపిస్తూ కొంటెగా ఫోటోల‌కు ఫోజులిచ‌చింది.

https://twitter.com/yoursanjali/status/1646810955781926912?s=20