రామ్ చ‌ర‌ణ్‌-బుచ్చిబాబు సినిమా క‌థ లీక్‌.. కాళ్లు లేని వ్య‌క్తిగా మెగా ప‌వ‌ర్ స్టార్‌!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన‌` ఫేమ్‌ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ పట్టాలెక్క‌బోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజ‌ర్‌` అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం బుచ్చిబాబు సినిమా ప్రారంభం కాబోతోంది.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. ఈ మూవీకి సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించ‌బోతున్నాడు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా క‌థ లీక్ అయింది.

రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామా క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. 1980 నేపథ్యంలో కబడ్డీ ఆట ప్రధానాంశంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. కాళ్ళు కోల్పోయిన అన్న పాత్రలో.. అలాగే ఆంధ్ర కబడ్డీ టీం కెప్టెన్ గా తమ్ముడి పాత్రలో రామ్ చ‌ర‌ణ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అన్న కలని సాకారం చేసే తమ్ముడి క‌థ ఇద‌ని ఇన్‌సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.