ఉపేంద్ర తో లవ్ రూమర్స్ పై.. నటి ప్రేమ ఏం చెప్పిందంటే..?

సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ ప్రేమ కూడా ఒకరు.. మొదటిసారి ఈమె 1995లో కన్నడలో విడుదలైన సవ్యసాచి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ప్రేమ. తెలుగు సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా దేవుళ్ళ వంటి సినిమాలలో నటించింది. దీంతో అప్పట్లో ఈమెకు పలు అవకాశాలు కూడా వెలుపడ్డాయి.

Upendra Matte Baa Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News &  Videos | eTimes
ప్రేమ కెరియర్లో ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలేక్టర్ ,సూపర్ పోలీస్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కెరియర్ బాగా సాగుతున్న సమయంలో జీవన్ అనే వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకొని కొద్ది రోజులకే తన నుండి విడిపోయింది.. దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలను తెలియజేసింది ప్రేమ.. ప్రేమ మాట్లాడుతూ తనకు చాలా సింపుల్ గా ఉండడం ఇష్టమని.. యాటిట్యూడ్ అనేది పెరిగిపోతే చాలా కష్టమని తనకు ఎలాంటి ఆస్తులు కూడా లేవని అవసరమైన డబ్బు మాత్రమే తన దగ్గర ఉందంటూ తెలియజేసింది ప్రేమ.

ఇక కన్నడ నటుడు ఉపేంద్ర తో ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఈ విషయంపై ఉపేంద్ర గారిని అడగాలి అది ఒక గాసిప్ అప్పుడు నా ఫోకస్ కేవలం సినిమాలపైనే ఉన్నది.. ఒకసారి సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తాయి.. ప్రతి విషయానికి నెగిటివ్, పాజిటివ్ అనేది రెండు ఉంటాయి ఇలా ఎవరికి నచ్చిన వాటిని వారు రాసుకుంటూ ఉంటారని తెలిపింది ప్రేమ. తనకు సౌందర్య మంచి స్నేహితురాలని తెలియజేస్తోంది.