రామ్ చరణ్ కు తలనొప్పిగా మారిన కమలహాసన్..!!

మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే తన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. నటీనటులు కూడా భారీగానే ఇందులో నటిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఈ సినిమా సాంగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.

fuck yeah Ram Charan — Happy Birthday Kamal Haasan! ~ November. 7/ 1954

శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజెర్ సినిమాతో పాటు కమల్ హాసన్ తో ఇండియన్-2 సినిమా కూడా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా వీలైనంత వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు శంకర్ .ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ షూటింగ్ కి ప్రస్తుతం కాస్త గ్యాప్ వచ్చిందని ఈ గ్యాప్ లోనే ఇండియన్-2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే రామ్ చరణ్ కు చాలా తలనొప్పిగా మారిందనే మాట తెలుగు ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్నాయి.వాస్తవానికి శంకర్ సినిమా వేగంగా కంప్లీట్ చేసి డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరొక సినిమాని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు రామ్ చరణ్.

Ram Charan shares excitement about Shankar directing RC15 & Kamal Haasan's  Indian 2 simultaneously | Celebrities News – India TV
కానీ శంకర్ మాత్రం గేమ్ చేజర్ మూవీ షూటింగ్ ఎక్కువగా గ్యాప్ తీసుకుంటున్నట్లు వార్త వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ ఫోకస్ మొత్తం ఇండియన్-2 చిత్రం మీద ఉండడంతో రామ్ చరణ్ మూవీ ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దిల్ రాజు మాత్రం గేమ్ చేజర్ మూవీ ని సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.