నటి ప్రగతి కుమార్తె కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందా..?

టాలీవుడ్ లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వారిలో ప్రగతి కూడా ఒకరు.. విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆఫ్ స్క్రీన్ లైఫ్ ను కూడా క్వాలిటీగా గడిపేస్తూ ఉంటుంది ప్రగతి. తనకు నచ్చిన పని చేయడంలో ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా జిమ్ములో కసరత్తు చేస్తున్నటువంటి వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ ట్రెండీగా మారుతూ ఉంటుంది. ఈమె రెమ్యూనరేషన్ కూడా ఇతర నటీనటుల కంటే ఎక్కువగానే ఉంటుంది.

Ragalahari on Twitter: "Actress #Pragathi daughter Geetha celebrates her  17th Birthday today. Here's a pic from #Geetha Birthday celebrations.  #PragathiMahavadi #birthday #birthdaygirl #tollywoodactress #Tollywood  #TeluguCinema https://t.co/Iy2ZZfrRhF ...
ఒక్కరోజు ఈమె కాల్ షీట్ దాదాపుగా లక్ష రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే ఈమె పాత్రను నచ్చి ప్రొడక్షన్ హౌస్ కూడా చిన్నదైతే రెమ్యూనరేషన్ తగ్గించుకొని మరి నటిస్తుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుచేతనే ఈమెతో సినిమాలలో నటించే నటీనటులు కూడా ఇట్టే కలిసిపోతూ ఉంటారు. అయితే పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రగతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.. ఆ తర్వాత తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో పిల్లల బాధ్యత మొత్తం తానే తీసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారిని పెంచి పెద్ద వారిని చేసింది. సినిమాలలో తన కుమార్తె పాత్రలు వేసి హీరోయిన్స్ తో చక్కటి అనుబంధం ఏర్పరచుకుంది ప్రగతి.. నిజ జీవితంలో కూడా కుమార్తె అంటే చాలా ప్రాణమని తనను కూతురుగా పొందడం అదృష్టమని తెలియజేస్తూ ఉంటుంది ప్రగతి.. ప్రగతి కూతురు పేరు గీత ఈమెకు 18 సంవత్సరాలు తన తల్లిలాగే చాలా అందంగా కనిపిస్తోంది. ఈమె ఫోటోలు చూసిన అభిమానులు సైతం ప్రగతి కుమార్తె ను కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఇమే ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.