గుడివాడ సీటుపై బాబు క్లారిటీ..కొడాలితో ఈజీ కాదు!

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే చంద్రబాబు…ఇప్పటికే చాలా సీట్లని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు సీట్లు ఇచ్చి ఇబ్బందులు పడటం కంటే..ఇప్పుడు ముందు నుంచి సీట్లు ఇచ్చి పార్టీకి అడ్వాంటేజ్ పెంచుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్ధులని బాబు డిక్లేర్ చేశారు. వారికి దాదాపు సీట్లు ఖాయమని చెప్పేశారు. అయితే ఇంకా బాబు కొన్ని సీట్లు ఫిక్స్ చేయాల్సి ఉంది.

వాటిల్లో కీలకమైనవి కొన్ని ఉన్నాయి..అందులో గుడివాడ మెయిన్ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ కొడాలి నాని వైసీపీలోకి వెళ్లారో..అప్పటినుంచి అక్కడ టి‌డి‌పి గెలవడం కష్టమైపోయింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి కొడాలి నాని గెలుస్తూ వచ్చారు. ఈ సారి కూడా గెలుపు దిశగానే వెళుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే టి‌డి‌పి రెండు రెండుసార్లు అభ్యర్ధులని మార్చినా సరే ఫలితం ఉండటం లేదు.

కానీ ఈ సారి మాత్రం కొడాలిపై బలమైన అభ్యర్ధిని పెట్టాలని బాబు చూస్తున్నారు. ఇప్పటికే ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు పోటీకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈయన గుడివాడలో యాక్టివ్ గా తిరుగుతూ పార్టీకి అండగా ఉంటున్నారు. దీంతో పార్టీ క్యాడర్ సపోర్ట్ కూడా రావికి ఎక్కువ ఉంది.కాకపోతే ఆర్ధిక పరమైన విషయాల్లో రావి కాస్త వెనుకబడుతున్నారు.

ఇదే సమయంలో ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము సైతం రేసులోకి వచ్చారు. ఇటీవల ఆయన గుడివాడలో సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. ఆర్ధికంగా బలమైన నేత..అటు తన భార్య ఎస్సీ కమ్యూనిటీ దీంతో ఆ ఓట్లు కూడా కలిసొస్తాయని అనుకుంటున్నారు. అటు పిన్నమనేని బాబ్జీ సైతం సీటు ఆశిస్తున్నారు. ఇక వీరిలో బాబు కొడాలిని ఢీకొట్టే నాయకుడుని నిలబెట్టాలి. మరో వారంలో గుడివాడలో భారీ సభ ఉంది..ఆ సభలోనే బాబు గుడివాడ టి‌డి‌పి అభ్యర్ధిని ఫిక్స్ చేస్తారేమో చూడాలి. అభ్యర్ధిని ముందే ఫిక్స్ చేస్తే బెటర్ లేదంటే..కొడాలితో ఈజీ కాదు.