వాళ్లు వీళ్లు ఎందుకు..? నా బయోపిక్ లో నేనే చేస్తా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

చిత్రపరిశ్రమకు క్రీడా రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎందరో నటిమలు క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రీడారంగంలో అద్భుతమైన ఆట తీరుని కనబరిచిన స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ధోని, సచిన్,కపిల్ దేవ్ మిథాలీ రాజ్ వంటి అగ్ర క్రీడాకారుల బయోపిక్లు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మరికొన్ని నిరుత్సాహపరిచాయి.

article_image2

ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం అని అతని బయోపిక్ లో నటించాలని ఉంది అంటూ ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. రామ్ చరణ్ మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి అగ్ర హీరోలు సైతం విరాట్ బయోపిక్ లో నటించాలని ఉంది అంటూ తమ మనసులోని మాటను బయటపెట్టారు.

article_image4

అయితే తాజాగా విరాట్ కోహ్లీ.. రాబిన్ ఊతప్పతో ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీకి ఈ ప్రశ్నే ఎదురైంది. ‘మీ బయోపిక్ మూవీలో ఏ హీరో నటిస్తే బాగుంటుంది?’ అని రాబిన్ ఊతప్ప అడడగా, విరాట్ కోహ్లీ ఏ మాత్రం ఆలోచించకుండా… ‘నేను… ’ అంటూ నవ్వేశాడు. దీంతో కోహ్లీ బయోపిక్ గురించి చర్చ మొదలైంది. కోహ్లీ బయోపిక్ లో ఇప్ప‌టికే పలువురు హీరోలు నటిస్తామంటూ కామెంట్ చేయగా ఈయన మాత్రం వాళ్ళెవరు వద్దు తానే నటిస్తాననేలా కామెంట్ చేశారని అర్థమవుతుంది.

article_image8

అయితే కోహ్లీ జీవితంలో కూడా ఎన్నో కీలక మలుపులు, ట్విస్టులు, కష్టాలు, ప్రేమ బ్రేకప్స్ పెళ్లి వంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోహ్లీ బయోపిక్ వ‌స్తే మ‌త్రం తప్పనిసరిగా హిట్ అవుతుంది. అయితే కోహ్లీ తన బయోపిక్ లో తానే నటిస్తానని చెప్పడంతో ఆయన నిజంగానే తన భార్య అనుష్క శర్మ సహకారంతో క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చాక సినిమాల్లోకి వెళ్లబోతున్నాడా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.