గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మీన‌న్.. హాట్ టాపిక్ గా రెమ్యున‌రేష‌న్‌!

సంయుక్త మీన‌న్.. ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భీమ్లా నాయ‌క్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన సంయుక్త‌.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత ఈ బ్యూటీ న‌టించిన బింబిసార‌, సార్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజయం సాధించాయి.

తాజాగా సంయుక్త మీన‌న్ `విరూపాక్ష` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇందులో హీరోగా న‌టించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ ఇది. నేటు అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని సినీ పండితులు చెబుతున్నారు.

మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో త‌క్కువ స‌మ‌యంలోనే సంయుక్త గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు ఈ అందాల భామ రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. విరూపాక్ష వ‌ర‌కు రూ. 50 ల‌క్ష‌ల కంటే లోపే తీసుకున్న సంయుక్త‌.. ఇక‌పై ఒప్పుకుంటున్న కొత్త ప్రాజెక్ట్ ల‌కు మాత్రం ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేస్తుందట‌. ఒక్క‌సారిగా కోటి రూపాయిలు పెంచేసింద‌ట‌. అయితే సంయుక్త‌కు ఉన్న క్రేజ్‌, స‌క్సెస్ రేటు దృష్ట్యా ఆమె అడిగిన మొత్తం ఇవ్వ‌డానికి నో చెప్ప‌లేక‌పోతున్నార‌ని ఇన్‌సైడ్ టాక్‌.