హీరోయిన్లను మించిన అందంతో మల్లేశ్వరి మూవీ చైల్డ్ యాక్టర్..!!

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఇక ఇప్పుడు పెద్దవాళ్లుగా మారిపోయారు.. వారిలో కొంతమంది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ల గా కొనసాగుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమ లైఫ్‌ని కొనసాగిస్తున్నారు. అయితే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించిన అప్డేట్లు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.

Watch Malliswari on ott streaming online

ఇక ఇప్పుడు వెంకటేష్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టుకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. వెంకటేష్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మల్లేశ్వరి కూడా ఒకటి.. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ స్టోరీ అందించారు. బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ ఈ సినిమాలో వెంకటేష్‌కు జంటగా నటించింది.

Greeshma Nethrikaa : చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ ఇప్పుడెలా ఉందో చూశారా! | Greeshma Nethrikaa

ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురుగా నటించిన‌ చిన్నారి క్యూట్ క్యూట్ మాట్లాడుతూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ చిన్నారి పాప పేరు గ్రీష్మ నేత్రి.. పలు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఆ చిన్నారి ఎలా ఉందో తెలుసా.. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లకు తీసుపోని అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

 Malleswari Movie Child Artist Greeshma Nethrikaa Transmissions, Greeshma Nethri-TeluguStop.com

ఇటీవల తన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అవి కాస్త వైరల్ గా మార‌యి. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. చూడముచ్చటైన రూపంతో కవ్విస్తోంది గ్రీష్మ. మరి ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. గ్రీష్మ నేత్రి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Grishma Nethri (@itsmegrishmanethri)