కోపంతో జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ.. కారణం..?

రెండు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో కార్యక్రమానికి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రతి శుక్రవారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది ఈ షో. ఇక ఇందులోకి ఎంతోమంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చి సినిమాలలో బాగానే సక్సెస్ అయ్యారు. దాదాపుగా తెలుగులో పది సంవత్సరాలుగా ప్రసారమవుతున్నప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంది ఈ షో.

Jabardasth Latest Promo - 13th April 2023 - Indraja,Sowmya Rao,Rocket  Raghava,Saddam - Mallemalatv - YouTube

అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కమెడియన్లు ఎంట్రీ ఇస్తూ కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇందులో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఇటీవల కాలంలో సీరియస్గా గొడవ పడడం లాస్ట్ లో ఫ్రాంక్ అని చెప్పడం కామన్ గా మారిపోయింది. అయితే కొన్నిసార్లు కంటెస్టెంట్లకు జడ్జిలకు మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి గతంలో నాగబాబు, రోజా కంటిస్టెంట్ల మీద ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా అటువంటి ఘటన ఇప్పుడు చోటుచేసుకుంది జడ్జిగా ఇంద్రజ స్టేజ్ దిగి వెళ్లిపోయినట్టుగా ప్రోమలో చూపించారు. ఏప్రిల్ 13వ తేదీన ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో ఒకటి వైరల్ గా మారుతుంది ఈ ఎపిసోడ్ ప్రోమో మొత్తం నవ్వుతూ నవ్విస్తూ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారు. అయితే స్కిట్ మధ్యలో జబర్దస్త్ యాంకర్ సౌమ్య పై కూడా సెటైర్లు వేశారు..ఇదంతా బాగానే ఉన్నా కానీ చివర్లో ఇంద్రజ కోపంతో అరిచి అక్కడ నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోతున్నట్లు చూపించారు..

అలా వెళ్ళిపోతూ తాగుబోతు రమేష్, వెంకీ టీం మధ్య కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసి మార్కుల విషయంలో వెంకీ టీం కి తొమ్మిది మార్కులు ఇవ్వడంతో కంటిస్టెంట్లు మేము 100% చేశామని అనుకుంటున్నాము మరి ఎందుకు పది మార్కులు ఇవ్వలేదు.. అని ప్రశ్నించగా 10 మార్కులు ఇచ్చినప్పుడు ఎందుకు అని ప్రశ్నించారో అడగలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటూ కోపంగా ఇంద్రజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఇదంతా టిఆర్పి రేటింగ్ కోసమే అన్నట్లుగా ప్రేక్షకులు భావిస్తున్నారు.