భర్త తో కలిసిపోయిన నీహారిక..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన మెగా డాటర్.. విడాకులు క్యాన్సిల్ అయిపోయాయోచ్.. !?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అంటూ గత 15 రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు మారుమ్రోగిపోతున్నాయి. నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య ఆమెతో పెళ్లికి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో డిలీట్ చేయడంతో ఈ అనుమానాలు పుట్టుకొచ్చాయి.

ఈ క్రమంలోనే ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాదు గత నాలుగు నెలల నుంచి సోషల్ మీడియాలో నిహారిక యాక్టివ్ గా లేదు . నిహారిక తన భర్తకు సంబంధించిన అప్డేట్ ఏది ఇవ్వడం లేదు . ఈ క్రమంలోనే నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ మెగా ఫాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. డివోర్స్ విషయంలో నిహారిక చైతన్య వెనక్కి తగ్గినట్లు ఓ న్యూస్ మెగా కాంపౌండ్ నుంచి లీకై ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవి మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అయ్యి నిహారిక చై- తన్యల ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని..

ఈ క్రమంలోనే చైతన్య ఫ్యామిలీ నిహారికను మళ్ళీ కలిపే ప్రయత్నం చేశారని …వాళ్ళిద్దరి మధ్య గొడవలు సర్ధుమనీగిన్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే త్వరలోనే నిహారిక తన అత్తగారింటికి వెళ్లిపోతుందని అభిమానులకు ఖుషి అవుతున్నారు . అయితే దీనిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ అఫీషియల్ ప్రకటన ఇచ్చిందే లేదు. నిహారిక విడాకులు తీసుకోబోతుంది అని కానీ విడాకుల ఒపీనియన్ నుంచి బయటికి వచ్చింది అని కానీ.. అటు మెగా ఫ్యామిలీ ఇటు జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?