మీ నాన్న గొప్పోడు ఓకే, నువ్వేం పీకావ్.. గోపీచంద్ ప‌రువు దారుణంగా తీసేసిన డైరెక్ట‌ర్‌!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప‌రువు దారుణంగా తీసేశాడు డైరెక్ట‌ర్ తేజ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న గోపీచంద్ త్వ‌ర‌లో `రామ‌బాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ శ్రీవాస్, గోపీచంద్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా డింపుల్ హయతి హీరోయిన్ గా న‌టించింది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే గోపీచంద్ ను ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ తేజ ఇంట‌ర్వ్యూ చేశాడు. తేజ తెర‌కెక్కించిన జయం, నిజం చిత్రాల్లో గోపీచంద్ విల‌న్ గా అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాల ద్వారా వ‌చ్చిన క్రేజ్ తోనే గోపీచంద్ హీరోగా మారాడు. ఒక‌ర‌కంగా గోపీచంద్ కి లైఫ్ ఇచ్చింది తేజనే.

అయితే గోపీచంద్‌-తేజ ఇంట‌ర్వ్యూకి సంబంధించిన ప్రోమో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముక్కు సూటిగా మాట్లాడే తేజ గోపీచంద్ ని షాకింగ్ ప్ర‌శ్న‌లు వేశాడు. `జ‌యం మూవీలో నీకు ఛాన్స్ కేవలం మీ నాన్న మంచితనం వల్లే వచ్చింది. మీ నాన్న గొప్పోడు ఓకే, నువ్వేం పీకావ్` అని ముఖం మీదే అడిగేశాడు. ‘నీకు ఒక కథ చెప్పాను. ఓకే చేద్దాం అన్నావ్. హీరోయిన్ సెట్ కాలేదు. హీరోయిన్ ని సెట్ చేసే లోపు నువ్వు సడెన్ గా ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశావు. నువ్వు నా ఫోన్ కూడా ఎత్తలేదు. నా కంటే మంచి డైరెక్టర్ దొరికాడనుకున్నావ్.. నన్ను పక్కన పెట్టేశావ్’ అని అన్నాడు తేజ‌. అవును ఫోన్ ఎత్తకపోవడం నా తప్పే అని గోపీచంద్ ఒప్పుకున్నాడు. రామబాణం షూటింగ్ సమయంలో గోపీచంద్ కి, శ్రీవాసుకి గొడవలు అయ్యినట్లు వార్త‌లు వ‌చ్చాయి. వాటి గురించి ప్ర‌శ్నించ‌గా.. నిజ‌మే అని ఒప్పుకున్నాడు. మొత్తానికి గోపీచంద్ ను తేజ త‌న ప్ర‌శ్న‌ల‌తో హ‌డ‌లెత్తించాడు. ఇంట‌ర్వ్యూకి సంబంధించి ఫుల్ వీడియో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానుంది.