రాజ‌మౌళి-మ‌హేష్ మూవీలో అఖిల్ కీల‌క పాత్ర‌.. ఓపెన్ అయిన అక్కినేని చిన్నోడు!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

అయితే ఏజెంట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అఖిల్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. `ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ మూవీ తెర‌కెక్కించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇదొక జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా.

పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అయితే `ఈ సినిమాలో మీకు ఓ కీలక రోల్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా?` అని అఖిల్ ను యాంక‌ర్ ప్ర‌శ్నించింది. అందుకు అఖిల్ అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చాడు. ఊహాగానాల గురించి ఇప్పుడెందుకు చెప్పండి అంటూ యాంక‌ర్ కు కౌంట‌ర్ ఇచ్చాడు. అనంత‌రం `రాజమౌళి, మహేష్ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటివారు. ఇక రాజమౌళి మూవీలో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి` అంటూ అఖిల్ పేర్కొన్నాడు. మొత్తానికి అవ‌కాశం వ‌స్తే ఖ‌చ్చితంగా చేస్తాన‌ని అఖిల్ తెలిపాడు. మ‌రి రాజ‌మౌళితో వ‌ర్క్ చేసే అదృష్టం అఖిల్ కు దుక్కుతుందో..లేదో..చూడాలి.