బిగ్ బ్రేకింగ్: షూటింగ్స్ కు బ్రేక్..హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మహేశ్ బాబు.. అభిమానులకు బ్యాడ్ న్యూస్..!?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం లేకపోనూ లేదు. ఎంతో సెన్సిటివ్ స్కిన్ గల మహేష్ బాబు టెంపరేచర్ పెరిగిపోవడంతో స్కిన్ రాషస్ వచ్చి ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వంలో మరో ప్రతిష్టాత్మకమైన సినిమాకి కమిట్ అయ్యాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా బడా ప్రాజెక్ట్స్ కి కమిట్ అయిన మహేష్ బాబు.. ప్రెసెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది .

అంతేకాదు మూడు నెలల పాటు లాంగ్ బ్రేక్ తీసుకొని మరి రెస్ట్ తీసుకోవాలని మహేష్ బాబు డిసైడ్ అయ్యారట . ఈ క్రమంలోనే ఇంకా మహేష్ బాబు పై కొన్ని సీన్స్ ..షాట్స్ ..సాంగ్స్ షూట్ చేయాలని.. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎస్ఎస్ఎఎంబి 29 సినిమా కూడా స్టార్ట్ చేయాలి అంటూ మేకర్స్ వెయిట్ చేస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు అన్న న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అయితే ఇప్పటివరకు దీనిపై మహేష్ బాబు గాని ఘట్టమనేని ఫ్యామిలీ గాని ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . నిజంగానే మహేష్ బాబు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారా..? ప్రెసెంట్ ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ..? అనేది అభిమానులకి ఘటననేని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తేనే రిలీఫ్ గా ఉంటుంది . లేకపోతే ఇది కావాలని కొందరు పుట్టించిన ఫేక్ వార్త అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి . చూడాలి దీనిపై మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా స్పందిస్తారో..?