చైతు అలాంటి వాడా..? అన్న నిజ‌స్వ‌రూపం బ‌ట్ట‌బ‌య‌లు చేసిన అఖ‌ల్‌!

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య నిజ‌స్వ‌రూపాన్ని ఆయ‌న త‌మ్ముడు, యంగ్ హీరో అఖిల్ అక్కినేని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. చైతు ఎలాంటో వాడో అత‌డు వివ‌రించాడు. అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది.

మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తాజాగా షూటింగ్ పూర్తి అవ్వ‌డంతో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు అఖిల్‌. ఈ సంద‌ర్భంగా సినిమా విశేషాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా పంచుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే అన్న నాగ‌చైత‌న్య గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. నాగచైతన్య సైలెంట్ కిల్లర్ అని.. పైకి క‌నిపించేంత‌ సాఫ్ట్ కాద‌ని అఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే అమ్మ‌నాన్న‌ల‌తో పాటు అన్న కూడా త‌న‌కు ఎంతో స‌పోర్ట్‌గా ఉంటాడ‌ని.. వారి ప్రోద్భలంతోనే సినిమాల్లో నటిస్తున్నాన‌ని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఏ ఉద్ధేశంతో అన్నాడో కాని చైతు గురించి అఖిల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం నెట్టింట సంచలనంగా మారాయి.