సడన్‌గా సూపర్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో.. కోట్లలో రెమ్యునరేషన్??

సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ అనేది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఓవర్ నైట్ స్టార్లు అయిన చాలా మంది ఆ తరువాత కొంతకాలనికే ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు. మరికొంతమందేమో పాపులారిటీ కోసం పాకులాడుతూ ఏళ్లుగా ఇండస్ట్రీలో అలానే పాతుకుపోతుంటారు. వెండితెర, బుల్లితెర అయినా సేమ్ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయం చాలా మంది సెలబ్రిటీల విషయంలో నిజం అయింది కూడా.

బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్ళకి వెండితెరపై లక్ కలిసిరాలేదనే చెప్పాలి. అలానే బుల్లితెర పై కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న షకలక శంకర్ బిగ్‌స్క్రీన్‌పై పెద్దగా హవా చూపించలేకపోయాడు. అయితే ఇద్దరు సెలెబ్రేటీలు మాత్రం వెండితెరపై తమ లక్కుని పరీక్షించుకోడానికి సిద్దమయ్యారు. వాళ్ళు ఎవరో కాదు కమెడియన్ సుడిగాలి సుధీర్, యూట్యూబ్ స్టార్ సుహాస్.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించి ఇప్పుడు వెండితెర ఆడియన్స్‌ని ఆకట్టుకోడానికి అడుగులు వేస్తున్నాడు. అలానే యూట్యూబ్ స్టార్‌గా కెరీర్ మొదలు పెట్టిన సుహాస్ కూడా వెండితెర ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కలర్ ఫొటో సినిమాతో విజయం సాధించిన సుహాస్ ప్రస్తుతం రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి అలరిస్తున్నాడు.

ప్రస్తుతం సుహాస్ ఒక్కో సినిమాకి రెండు కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. అయితే సుహాస్ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం సుహాస్ కాల్ షీట్ అసలు ఖాళీ లేదట. ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు సినిమాలో నటించడానికి కూడా సుహాస్ డేట్స్ ఖాళీగా లేవట. ఇప్పటికే సుడిగాలి సుధీర్ కోటిన్నర వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం సుహాస్ దానిని దాటేసారనే విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.