రాజకియాలోకి దిల్ రాజు .. ఏ పార్టీ నుంచో తెలిస్తే గుండె ఆగిపోతుందేమో..? ఇంత షాక్ ఇచ్చాడు ఏంట్రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో.. రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది . టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ..? అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . ఇప్పటికే దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్లో అన్ని పనులు పూర్తయ్యాయని ..రేపో మాపో దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ సినీ ఇండస్ట్రీలో కూడా న్యూస్ వైరల్ గా మారింది.

అయితే దిల్ రాజు ఏ పార్టీలో చేరబోతున్నారు తెలిస్తే ఖచ్చితంగా అభిమానులకు గుండె ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే దిల్ రాజుకి ఎంత ఇష్టమో మనందరికీ బాగా తెలిసిందే. పవన్ కళ్యాణ్ అంటే దిల్ రాజు భార్యకి కూడా చాలా ఇష్టం . నేను ఆయనకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది . కేవలం ఆమె కాదు దిల్ రాజు సైతం పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతాను అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇలాంటి క్రమంలో అందరూ ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా జనసేన తరపున పోటీ చేస్తారు అంటూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలా అనుకోవడానికి మెయిన్ రీజన్ ఇటీవల దిల్ రాజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలలో వీరు కలిశారు . ఈ క్రమంలోని వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ టైంలోనే దిల్ రాజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు . చూడాలి మరి దిల్ రాజుఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?