వీడియో: అవార్డు ఫంక్షన్‌లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన గబ్బర్ సింగ్ యాక్ట్రెస్..

ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ కెవ్వు కేక పాటలో పవన్ కళ్యాణ్‌తో కలిసి డ్యాన్స్ చేసి సెగలు పుట్టించింది. అయితే ఈ తార వయసు ఇప్పుడు 49. అంటే దాదాపు ఆంటీ వయసు అని చెప్పవచ్చు. అయినా కూడా ఈ హాట్ బాంబ్ 37 ఏళ్ల బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో రొమాంటిక్ రిలేషన్‌షిప్ నడుపుతోంది. పైగా కుర్రాళ్ళతో డేటింగ్ అద్భుతంగా ఉంటుందని నిస్సిగ్గుగా చెబుతోంది. అయితే తాజాగా ఒక ఫంక్షన్ లో మలైకా ఒక పని చేసింది దాన్ని గమనించిన నెటిజన్లు దారుణంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

మలైకా మార్చి 24 జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్‌కి హాజరయ్యింది. ఫోటోలు తీస్తున్నప్పుడు ఆమె తన పొట్టను లాక్కునేందుకు ప్రయత్నించింది. ఆమె తన పొట్టను లోపలికి లాక్కుంటూ ఫోటోలు దిగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని చూసిన నెటిజన్లు మలైకా అరోరా రూపాన్ని ఎగతాళి చేస్తున్నారు. “వయసు పై పడ్డాక పొట్ట వస్తుంది, దాన్ని లోపలికి లాక్కొని ఇంకా ఎంతకాలం కుర్రోళ్ళతో డేటింగ్ చేస్తావ్” అంటూ దారుణమైన కామెంట్లను నెటిజన్లు పెడుతున్నారు.

వీడియో చూస్తే మలైకా నిజంగానే కాస్త ఫిట్‌గా కనిపించేందుకు ట్రై చేసినట్లు అనిపించింది. ఏదేమైనా ఆమె బ్లాక్ డ్రెస్ లో చాలా అందంగా ఉండి అందరి కళ్ళను తనవైపే తిప్పుకుంది. ఈ వయసులో కూడా అలాంటి నాజుకైన ఫిగర్ మైంటైన్ చేస్తుండటం నిజంగా మెచ్చుకోదగిన విషయమే. ఇకపోతే సోషల్ మీడియాలో విషపూరిత ట్రోలింగ్ కొత్తేమీ కాదు. ఇక్కడ నెగిటివ్, ద్వేషపూరిత వ్యాఖ్యలు సర్వసాధారణం. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులు కాదు, మరి ఈ బాడీ షేమింగ్ ట్రోలింగ్‌పై మలైకా ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)