అత‌నంటే పిచ్చి ఇష్టం.. ఫైన‌ల్‌గా ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన కీర్తి సురేష్!

ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం `దసరా` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సముద్రఖని, సాయి కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ నేథ‌ప్యంలోనే మేక‌ర్స్ ద‌స‌రాను సౌత్ తో పాటు నార్త్ లోనూ గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది.

ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ హీరోపై త‌న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టింది. బాలీవుడ్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు? అని ప్ర‌శ్నిగా.. స‌రైన ఆఫ‌ర్ కోసం ఎదురు చూస్తున్నాన‌ని స‌మాధానం ఇచ్చింది. బాలీవుడ్ లో మీ అభిమాన హీరో ఎవ‌రు అని అడ‌గ‌గా.. క్ష‌ణం కూడా ఆలోచించకుండా షారుఖ్ ఖాన్ అని ఆన్స‌ర్ ఇచ్చింది. అంతేకాదు, షారుఖ్ అంటే పిచ్చి ఇష్ట‌మ‌ని.. ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌స్తే అస్స‌లు వ‌దులుకోన‌ని తెలిపింది. మ‌రి షారుక్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవ‌కాశం మ‌న మ‌హాన‌టికి వ‌స్తుందో లేదో చూడాలి.