“ఎన్ని అవార్డులు వచ్చినా.. ఆ ఒక్కటి ఇచ్చే ఫీలింగే వేరు”.. రాజమౌళికి ఆ కోరికలు ఎక్కువే..!!

ప్రెసెంట్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రపంచవ్యాప్తంగా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అదే ఆర్ ఆర్ ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మార్చి 24న 2022. గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయి ఫస్ట్ షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది మరీ ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డులను కొల్లగొట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది .

అంతేనా రీసెంట్గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు అందుకున్న మూవీ గా సంచలన రికార్డులను నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ అయి నిన్నటికి ఏడాది కావడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గ్రాండ్ కంగ్రాట్స్ చెప్పారు జనాలు. కాగా ఇలాంటి క్రమంలోనే ఆర్ఆర్ఆర్ టీం స్పెషల్ నోట్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

“సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావస్తుంది . ఇప్పటికీ పలు థియేటర్స్ లో ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి. ఈ సినిమా ఎన్ని అవార్డులు సాధించిన ఆ ఫీలింగ్ కన్నా ఏది ఎక్కువ కాదు. ఆర్.ఆర్.ఆర్ చిత్రం పై మీరు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పిన సరిపోదు అంటూ ప పోస్ట్ చేసుకొచ్చింది చిత్ర బృందం . ఈ క్రమంలోనే రాజమౌళి పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా త్రెండ్ అవుతుంది. అంతేకాదు ఫైనల్లీ రాజమౌళి అనుకున్న కల నెరవేరిందని.. ఈసారి రాజమౌళి.. మహేష్ బాబు సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు అందుకునేంత పక్కా ప్లానింగ్ తో సినిమాను ముందు నుంచే పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే రాజమౌళికి కోరికలు ఎక్కువే అంటూ కూడా కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు..!!