పూజా హెగ్డేను వ‌ద‌ల్లేక‌పోతున్న బాలీవుడ్ హీరో.. బుట్ట‌బొమ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది మొత్తం వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ అపజయాలు ఎదురవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు అంతంత మాత్రంగా మారాయి. తెలుగులో మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో `కిసీ కా భాయ్, కిసీ కా జాన్` అనే సినిమా చేస్తోంది.

ఈ రెండు ప్రాజెక్టులు మినహా పూజా హెగ్డే చేతిలో మరో సినిమా లేదు. అయితే బాలీవుడ్ లో తాజాగా బుట్టబొమ్మను ఓ బంపర్ ఆఫర్ వరించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సల్మాన్ ఖాన్ కి జోడిగా మరో సినిమాలో నటించే అవకాశం దక్కిందట. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంట‌గా నటించిన సినిమా ‘బజరంగీ భాయిజాన్’. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

సల్మాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ‘పవన్ పుత్ర’ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనున్నారని బీటౌన్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ లో పూజా హెగ్డే నటనకు సల్మాన్ ఫిదా అయ్యారట. అందుకే ఆమెను వ‌ద‌ల్లేక‌ పవన్ పుత్ర‌లో పూజాకు ఛాన్స్ ఇచ్చినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.