కృతి రాంగ్ స్టెప్.. అయ్యయ్యో..లెక్క తప్పిందే..!!

కన్నడ బ్యూటీ లెక్క తప్పిందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఉప్పెన . ఈ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ పోయిన కృతిశెట్టి.. ఆ తర్వాత చేసిన రెండు సినిమాల హిట్ అయ్యాయి.

అయితే అమ్మడు అదృష్టమో లేక దురదృష్టమో తెలియదు కానీ.. ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే జనాలు కృతి శెట్టి పేరుని మర్చిపోతూ వచ్చారు. కాగా ఈ క్రమంలోనే కృతి శెట్టి ఇలా అయితే ఇండస్ట్రిలో అవకాశాలు రావు అనుకునింది. ఈ క్రమంలోనే రీసెంట్గా నాన్నతో ముంబైకి వెళ్లి సరదాగా గడిపింది . అక్కడ తన అందాలను మీడియా వాళ్లకి ఓపెన్ గా చూపించింది .

 

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఆఫర్స్ కోసం కృతి శెట్టి ట్రై చేస్తుందన్న న్యూస్ వైరల్ అయింది. అయితే తెలుగులో హిట్ కొట్టిన కృతి పాప అప్పుడే బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తుందా ..? ఇక మన తెలుగు హీరోలతో చేయదులే అంటూ డైరెక్టర్స్ ఫిక్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే అరాకొరా కృతికి అవకాశాలు ఇవ్వాలనుకున్న డైరెక్టర్లు కూడా ఆ ముంబై ఫోటోలు చూసి అవకాశం ఇవ్వడమే మానేశారు . దీంతో అమ్మ పెటనీక అటు అడుక్కతిననిక మధ్యలో నలిగిపోతుంది కృతి శెట్టి..!!

Share post:

Latest