అప్పుడు శ్రీజ..ఇప్పుడు నీహారిక అదే తప్పు.. అందుకే మొగుడ్లు విడాకులు ఇచ్చేసారా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో మెగా డాక్టర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. అప్పట్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా గ్రాండ్గా స్టార్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోయేలా చేసారు. డబ్బు విషయంలో వెనకడుగు వేయకుండా.. కోట్లకు కోట్లు పోసి నిహారిక కళ్ళల్లో ఆనందానికి కారణమయ్యారు మెగా బ్రదర్ నాగబాబు .

పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు బుద్ధిగా కాపురం చేసుకున్న ఈ జంట .. త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దానికి కారణం జొన్నలగడ్డ చైతన్య – నిహారికతో పెళ్లి జరిగిన పిక్స్ ను డిలీట్ చేయడమే కారణం అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఇదివరకే మెగా ఫ్యామిలీలో డివర్స్ తీసుకున్న శ్రీజ అప్పట్లో ఎలాంటి తప్పు చేసిందో ఇప్పుడు నిహారిక కూడా అదే తప్పు చేసిందని.. ఆ కారణంగానే చైతన్య విడాకులు ఇవ్వబోతున్నారు అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ మొదట ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది .

ఆ తర్వాత ఓ బిడ్డను జన్మనిచ్చాక అతగాడితో వచ్చిన విభేదాలు కారణంగా డివర్స్ తీసుకొని .. రెండోసారి పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకునింది. అయితే తప్పు ఎవరిదో తెలియదు కానీ అతగాడికి విడాకులు ఇచ్చేసింది . మెగా డాటర్స్ ని అతి గారాబంగా పెంచడం వల్లే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. శ్రీజ కూడా మొండి పట్టుదల అమ్మాయి ..తాను చెప్పిందే జరగాలి అనుకునే టైప్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కారణంగానే అప్పట్లో భరద్వాజ్ ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ లకి విడాకులు ఇచ్చేసిందని.. ఇప్పుడు నిహారిక కూడా అదే లిస్టులోకి యాడ్ అయిందని ..సినిమాల విషయంలో జొన్నలగడ్డ చైతన్య పెట్టిన రెస్ట్రిక్షన్స్ కారణంగానే నిహారిక అతగాడితో విభేదాలు వచ్చాయని .. ఈ కారణంగానే మాట మాట పెరిగి ఇప్పుడు డివర్స్ తీసుకునే స్ధాయికి వెళ్లిపోయింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.