క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇష్టపడతారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి..

ప్రస్తుతం ఓటీటీ సంస్థలు బాగా ఎక్కువైపోయాయి. ఇవి కొత్త వెబ్ సిరీస్లు, సినిమాలతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్, హాట్‌స్టార్‌ వంటి ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను, సినిమాలను చూసి ఆనందించవచ్చు. ఇక ఇప్పుడు ఓటీటీలో మీకు థ్రిల్ కలిగించే క్రైమ్ థ్రిల్లర్స్‌ ఏవో తెలుసుకుందాం.

• తల్వార్

2008లో నోయిడాలో జరిగిన ఆరుషి హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ మిస్టరీ ఆధారంగా ‘తల్వార్’ సినిమాను రూపొందించారు. స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. మీరు ఈ సినిమాని చూడాలి అనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు.

• నో వన్ కిల్డ్ జెన్సిక

 

ఆరుషితో పాటు జెన్సిక హత్య కేసు గురించి కూడా సినిమా తీశారు. ఈ సినిమా పేరు ‘నో వన్ కిల్డ్ జెన్సిక’ . ఈ సినిమా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇందులో రాణి ముఖర్జీ, విద్యా బాలన్ నటించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.

• రుస్తోం

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన మర్డర్ మిస్టరీ మూవీ ‘రుస్తోం’. ఈ మూవీలో ఒక నేవి అధికారి హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. ఆ హత్య వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడమే కథ. ఈ సినిమా మొత్తం రొమాన్స్ తో నిండిపోయి ఉంటుంది. మీరు ఈ సినిమాని జీ-5లో చూడొచ్చు.

• బాండిట్ క్వీన్

అగ్రవర్ణ ఠాకూర్ల చేతుల్లో లైంగిక వేధింపులు, కులపరమైన వేధింపులకు గురై, బందిపోటుగా మారి ఠాకూర్లకు ఎదురు తిరిగిన ఫూలన్‌ దేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘బాండిట్ క్వీన్’. ఈ సినిమాని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

• షూట్ అవుట్ ఏట్ లోఖండవాలా

‘షూట్ అవుట్ ఏట్ లోఖండ్వాలా ‘ మూవీని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాని డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు.