ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి వారికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సినిమాలు ఇతర భాషల్లో ఇతర నటీనటులతో తీసి సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.
అలాంటి సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రాంగోపాల్ వర్మ ‘రంగీలా ‘ సినిమా. నిజానికి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు సూపర్ స్టార్ రజినీకాంత్, అతిలోకసుందరి శ్రీదేవి లతో తీయాల్సి ఉంది. ఇలాంటి అరుదైన కాంబినేషన్ తో సినిమా తీస్తే అవకాశం రాంగోపాల్ వర్మ వదులుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ చెప్పారు.
ఆ టైంలోనే నాగార్జునతో శివ సినిమా తీసి ఇండస్ట్రీలోని అదిరిపోయే సూపర్ హిట్ అందుకున్నాడు రాంగోపాల్ వర్మ. శివ సినిమా చూసిన అశ్వినీ దత్ రాంగోపాల్ వర్మతో ఎలాగైనా సినిమా తీయాలనుకుని కథ వినకుండానే రాంగోపాల్ వర్మకి అడ్వాన్స్ ఇచ్చేశారు. అప్పుడే రాంగోపాల్ వర్మ రంగీలా, గోవిందా గోవిందా వంటి కథలు అశ్వినీదత్‌కు చెప్పారు.
కానీ అశ్విని దత్‌కి గోవిందా గోవిందా కథ బాగా నచ్చింది. వర్మ రంగీలా కథను సినిమా చేద్దామని ఎంత చెప్పినా వినలేదు అశ్వినీ దత్. అ తర్వాత వర్మ అ కథను బాలీవుడ్‌లో ఊర్మిళ, ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ల తో ‘రంగీలా’ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగులో కూడా ఇదే సినిమా ‘రంగేళి’ గా విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమా నిజంగానే.. చిరంజీవి, రజనీకాంత్, శ్రీదేవిలతో తీసి ఉంటే.. దాని రిజల్ట్ ఎలా వచ్చేదో. అయితే వర్మ, చిరు, రజనీ, శ్రీదేవి కాంబోలో రంగీలా తీద్దామని చెప్పినా అశ్వనీదత్‌కు నచ్చలేదు. చివరకు గోవిందా ప్లాప్ అయితే రంగీలా సూపర్ హిట్ అయ్యింది.