ఇంట్రెస్టింగ్: ఆ నిర్ణయంతో రాశి జీవితానే మ‌లుపు తిప్పిన‌ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరే ఓ ప్రభంజనం.. ప్రస్తుతం ఆయన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. కానీ ఆయన కెరీర్ మొదటిలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాలు ఎన్నో తీశారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా గోకులంలో సీత. ఈ సినిమా పవన్ కెరియర్ లోనే ఓ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఆ టైంలో కుర్రాళ్ళతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశి నటించిన విషయం తెలిసిందే. తెర పై ఇద్దరి జంట బాగా అలరించింది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిని సెలక్ట్ చేసింది మెగాస్టార్ భార్య పవన్ కళ్యాణ్ వదిన సురేఖనట.
రాశికి చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న మంచి రిలేషన్ కారణంగానే ఈ ఆఫర్ వచ్చిందట. చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో రీమేక్ చేసే టైంలో రాశి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అలా రాశికి చిరంజీవి కుటుంబంతో రిలేషన్ ఏర్పడింది. అదే సందర్భంలో ఒకసారి చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి చెన్నై వెళ్లారు ఆ టైంలో రాశి కుటుంబ సభ్యులకు కూడా చెన్నైలోనే ఉండేవారు.

Watch Gokulamlo Seetha | Prime Video

చెన్నై వెళ్లిన చిరంజీవి నుంచి రాశి తండ్రికి ఫోన్ వచ్చిందంట. దీంతో రాశి తండ్రి ఆమె ఫోటోలను తీసుకుని చిరును కలిసేందుకు వెళ్లారట. అక్కడ చిరంజీవితో పాటు సురేఖ కూడా ఉన్నారట. రాశి తండ్రి తెచ్చిన ఫోటోలను చూసి రాశి హీరోయిన్ అయితే బాగుంటుందని అన్నారట. అప్పుడే పవన్ కళ్యాణ్ గోకులంలో సీత స్టోరీని చిరంజీవి సురేఖ విన్నారట రాశి ఫోటోలను చేసిన సురేఖ పవన్ కళ్యాణ్ పక్కన రాశి అయితే బాగుంటుంది అని చెప్పడంతో.. దీంతో చిరంజీవి కూడా ఓకే అనేసారు.

ఆ తర్వాత దర్శకుడు మోడ్రన్ డ్రెస్సులో ఫోటోలు తీసి నిర్మాతకు చూపించారు. ఆ తర్వాత నిర్మాతలు కూడా ఓకే చెప్పడంతో రాశిని హీరోయిన్గాన్‌గా కన్ఫామ్ చేశారు. ఈ విధంగా చిరు భార్య సిఫార్సుతో రాసి పవన్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆ తర్వాత రాశి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రాశి ఎక్కువగా ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్లే చేసింది ముద్దుగా అందాల రాశి అని పిలిచేవారు. రాశి ఇప్పటికి కూడా తన సినిమా జీవితాన్ని అపకుండా సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.