మనోజ్ ఇంటిపైకి దాడికి దిగిన మంచు విష్ణు వీడియో వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎక్కడికి వెళ్లిన వీరందరూ కలిసే ఉంటారని విషయం అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరుగా పొందింది మంచు ఫ్యామిలీ. ఇప్పుడు తాజాగా మంచు వారి ఇంట్లోనే గొడవలు రోడ్డుకు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి మంచు మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వచ్చి దాడి చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ మేరకు మంచు మనోజ్ ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది.

ఈ వీడియోలో ఇలా ఇంటి మీదకు వచ్చి దాడి చేస్తున్నాడు విష్ణు అంటూ విజువల్స్ మనోజ్ షేర్ చేయడం జరిగింది. అయితే ఈ విజువల్స్ లో మంచు విష్ణు కనిపించారు ఒరేయ్ అని ఏదో అన్నాడు కదా అని విష్ణు అరుస్తూ ఉన్నాడు, విష్ణు ను అక్కడున్న కొందరు ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇదిగో అండి ఇలా ఇంటి మీదికి వచ్చి అందరిని కొడుతూ ఉంటాడు అంటూ తన అన్న గురించి ఒక వీడియోని మంచు విష్ణు షేర్ చేసినట్లుగా నెట్టింటే ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

మంచు వారింట్లో ఇలాంటిది ఏదో జరుగుతుందని రూమర్లు ఇదివరకే ఎక్కువగా వినిపించాయి. మంచు సోదరులు మధ్య మంచి బంధాలు లేవని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.. గతంలో కూడా మంచు మనోజ్ గురించి మాట్లాడను అది వాడి పర్సనల్ లైఫ్ అంటూ మంచు విష్ణు ఒకసారి తెలియజేయడం జరిగింది.

మంచు మనోజ్ ,భూమ మౌనికల పెళ్ళిలో కూడా మంచు విష్ణు పెద్దగా కనిపించలేదు. అలా వచ్చి ఇలా వెళ్లినట్టుగా ప్రవర్తించారు కానీ మంచు వారి విభేదాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

https://twitter.com/hooligan669/status/1639140279700660224?s=20